Elephants | రైతులను కలవరపెడుతున్న ఏనుగుల గుంపు..
ఏనుగుల ధాటికి పంటల నష్టం..
Elephants | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా గుర్ల మండలం రౌతుపేటలో గత నాలుగు రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామ శివార్లలోకి ప్రవేశించిన ఏనుగులు వరి నారుమడులు, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు పొలాల వద్ద కాపలా కాస్తున్నారు. ఏనుగుల సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల గుంపు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
