Tirupati | డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ దే..

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఆ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ మేరకు టీడీపీ అభ్యర్థి ముని కృష్ణకు మద్దతుగా 26ఓట్లు రాగా, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్‌ కు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో తీవ్ర ఉత్కంఠ వాతావరణంలో ముని కృష్ణను ఎన్నికల అధికారి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు.

అయితే, ఇరువర్గాలు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి కోసం చివరి వరకు హోరాహోరీగా తలపడ్డాయి. రెండు పార్టీలూ పోటాపోటీగా క్యాంప్‌లు ఏర్పాటు చేశాయి. అయితే చివరి నిమిషంలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు తెలపడంతో కూటమి అభ్యర్థి గెలిచినట్లయింది. కాగా, సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక ఎస్వీయూ ఆవరణలో రణరంగంగా మారింది. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక డిప్యూటీ మేయర్ ఎన్నికను నేటికి వాయిదా పడింది.

Leave a Reply