మానవీయమైన విలువలను, భక్తి భావాన్ని పెంచాలి

వికాస తరంగిణి చైర్మన్ గీతారెడ్డి

తొర్రూరు టౌను, ఆంధ్రప్రభ : మండలంలోని అమ్మపురం ఖానాపురం గుర్తూరు గ్రామాల్లో శ్రీరామ హృదయం కలశం శోభయాత్ర గురువారం వికాస తరంగిణి తొర్రూర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శోభాయాత్ర గురించి వికాస తరంగణి మండల చైర్మన్ కుందూరు గీతా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా స్వామివారి ఆదేశాల మేరకు శ్రీరామ హృదయం కళాశాలను స్వామివారి మంగళ శాసనములతో వచ్చాయని మండలంలోని 21 గ్రామాల్లో ఆలయాలలో పూజలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జీయర్ స్వామి వారి జన్మదినం నవంబర్ 8వ తేదీన దీపావళి రోజు హైదరాబాదులోని ముచ్చింతల్లో ఉన్న స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో జరుగుతుందని ,ఈ కార్యక్రమానికి పూర్వపరంగా సత్సంగం లో భాగంగా ప్రతిరోజు ఆలయాలలో విష్ణు సహస్రనామం స్తోత్రములు పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ సమాజంలో మానవీయమైన విలువలను, ప్రేమ ఆప్యాయతలను, వ్యక్తుల మధ్యపెంపొందించడం , సఖ్యత పెరగాలని ఉద్దేశంతో గౌరవం, స్నేహం, కుటుంబాలలోను, సమాజంలోనూ పెంపొందించాలని కోరుకుంటూ ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుడిని మన హృదయంలో నింపుకుంటూ ఆయన హృదయంలో మనమందరం చేరిఉండాలనే సత్సంకల్పంతో శ్రీరాముని మదిలో నింపండి, శ్రీరాముని మదిలో చేరండి అనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.

స్వామివారి ఆరాధ్య దైవమైన కోదండరామునికి 33 సంవత్సరాలుగా సహస్ర కళాశాభిషేకం జరుగుతుందని అభిషేకంలో వినియోగించే మంత్రపూతమైన కళశాలు శ్రీరామ హృదయాలని అవి గ్రామాలకు వచ్చాయని లేదంటూ ప్రేమ పూర్వకమైన సమాజాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి మీ యొక్క హృదయాలను కళాశాలలో శ్రీరామ నామంతో ఏరగలిగినన్ని బియ్యం గింజలు వాటిలో సమర్పించడం జరుగుతుందని ఆ బియ్యంతో ప్రసాదాలు చేసి అందరికీ పంచడం జరుగుతుందని ఈ యొక్క బియ్యాన్ని నవంబర్ 13వ తేదీన కోదండరాముడికి అభిషేకంగా సమర్పిస్తారని చెప్పారు .

భగత్ బంధువులైన అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కలశంతో మంత్రపఠనం చేస్తూ శోభాయాత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి బస్టాండ్ సెంటర్ మీదుగా గ్రామంలో గుట్టపై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వరకు కోలాటం నృత్యాలతో ఘనంగా శోభాయాత్ర జరిగింది అనంతరం ఆలయంలో కలశం కు అర్చకులు యాదిగిరాచార్యులు శ్రీకాంత్ చార్యులు నాగశేషాచార్యులు వేణుమాధవ్ లు భక్తులచె సామూహిక పూజా కార్యక్రమం నిర్వహించి అందులో శ్రీరామ జయ రామ జయ రామ అంటూ 11 సార్లు నామ జపం చేయించి అక్షితలను కలశంలో వేయించారు ఈ కార్యక్రమంలో అమ్మాపురం గ్రామ సర్పంచ్ సునీత వీరారెడ్డి ఉపసర్పంచ్ విశాల్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు తమ్మెర వీరభద్రరావు జూలూరు జగన్ అశోక్ వికాస తరంగిణి చైర్మన్ కుందూరు గీతారెడ్డి , ,ప్రసూన ,విజయలక్ష్మి, రేణుక, శోభ,, లక్ష్మి , అనుపమ ,ఇమ్మడి గీతారాణి ,ఉప్పల ఇందిర, నూనె స్వరూప ,నాల్ల కృష్ణమూర్తి , కోనే సాయిచంద్ ,సమ్మయ్య, సాయి కీర్తన ,తదితరులు పాల్గొన్నారు