Mid-Day-Meal : చిక్కిలు చిటుక్కు..Andhra Prabha Top Story
Mid-Day-Meal : చిక్కిలు చిటుక్కు..Andhra Prabha Top Story
- గుడ్లు గుటుక్కు..
- మిడ్ డే మీల్ మాయాజాలం
- పీఎంశ్రీ నిధులు గోవిందా
- అన్నీ తప్పుడు బిల్లులే
- లెక్కలన్నీ చిత్రం భళారే విచిత్రం
- ఇదీ చింతలపూడి జెడ్పీహెచ్ స్కూలు కథ
( ఏలూరు .ఆంధ్ర ప్రభ)

Mid-Day-Meal : ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం లో అవతవకలు కలకలం రేపుతున్నాయి. ఒక పక్కా కూటమి ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా పే టి యం నిర్వహించగా మరో పక్క పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం లో మెనూ ప్రకారం చిక్కిలు,కోడి గుడ్లు మాయం అవుతున్నాయి. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో గల
పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ అధికారులు తనిఖీల్లో వెలుగు చూసిన వైనం సంచలనం రేపింది. సామాన్య,మధ్య తరగతి కుటుంబాల పిల్లలు అందాల్సిన చిక్కి లు,కోడి గుడ్లు మాయం అయ్యాయి. మండల విద్యాశాఖ అధికారి ఎస్.కిరణ్ ఉన్నత ఆదేశాల మేరకు తనిఖి చేయగా రిజిస్టర్ లెని స్టాక్ తేడాను గమనించారు .
తనిఖీ సమయానికి 1963 చిక్కిలు బదులు కేవలం 389 మాత్రానే కనిపించాయి. ఇక 120 కోడి గుడ్లు తేడాను గుర్తించారు. పాఠశాలలో పీఎం శ్రీ నిధులకు ప్రై వేట్ వ్యక్తుల ద్వారా తప్పుడు బిల్లులు పెట్టి సొమ్ము డ్రా చేస్తున్నారని, 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు 125 రూపాయలు ఉండగా విద్యార్థుల వద్ద 250 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి . మూడో శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే సందర్భంగా అందించవలసిన స్నాక్స్ అందించకుండానే బిల్లులు చేసుకుంటున్నారని,
ఆగస్టు 15 జాతీయ జెండా ఆవిష్కరణ రోజు 25 000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా వాటికి తప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేశారని,
యాన్యువల్ డేకు 50 వేల రూపాయలు ఖర్చు చేయవలసి ఉండగా వాటిని పాఠశాల బడ్జెట్ నుంచి కాకుండా విద్యార్థుల వద్ద వసూలు చేశారని ఆరోపణలు తల్లిదండ్రుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి-2 కిరణ్ బాబును సంప్రదించగా చిక్కీలు, కోడిగుడ్లు లెక్కలు వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమేనని హెచ్ఎం వివరణ అడగగా మెగా పిటీఎం లెక్కలు ఇంకా రాయలేదని వివరణ ఇచ్చారు. ఈ అవకతవకలపై,ఆరోపణలపై జిల్లా అధికారులు విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాలు కోరుచున్నారు.
