నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

  • పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్…

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (టీజీపీఆర్‌బీ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 275 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో పోలీసు శాఖతో పాటు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖలకు చెందిన పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు టీజీపీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

పోస్టుల వివరాలు

  • ఎస్‌సీటీ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (సివిల్) – 148 పోస్టులు
  • ఎస్‌సీటీ రిజర్వ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్) – 14 పోస్టులు
  • ఎస్‌సీటీ రిజర్వ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఏఆర్ సీపీఎల్) – 3 పోస్టులు
  • ఎస్‌సీటీ రిజర్వ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (టీజీఎస్‌పీ) – 12 పోస్టులు
  • తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్ – 44 పోస్టులు
  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39 పోస్టులు
  • డిప్యూటీ జైలర్ (పురుషులు) – 14 పోస్టులు
  • డిప్యూటీ జైలర్ (మహిళలు) – 1 పోస్టు

వయోపరిమితి, విద్యార్హతలు, దరఖాస్తుల గడువు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలను టీజీపీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.