ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

  • పశ్చిమ నియోజకవర్గంలోని పలు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
  • అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేతలు

విజయవాడ, ఆంధ్రప్రభ: పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పలు షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా, టీడీపీ సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌తో పాటు కూటమి నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహాత్మా గాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మసాని సుబ్బారావు, ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంప్లెక్స్ అధ్యక్షుడు పరుచూరి నాగేశ్వరరావు, కార్యదర్శి కాసుల వెంకట నారాయణ పాల్గొన్నారు.

చెరువు సెంటర్‌లోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం (చిన్న సాయిబాబా గుడి)లో సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా ప్రసాదాన్ని వడ్డించారు. మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావు, జనసేన కృష్ణా జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి గంజి పవన్, జనసేన నాయకులు లింగం శివప్రసాద్, తమ్మిన లీల కరుణాకర్, గన్ను శంకర్, బాదర్ల శివ, శనివారపు శివ, రేలంగి బుజ్జి, దేవకీ తదితరులు పాల్గొన్నారు.

పూర్ణానందంపేటలోని శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరంలో శ్రీ షిర్డీ సాయి సత్సంగ మండలి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకుడు సారేపల్లి రాధాకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధ్యక్షుడు ఆకుల బాబురావు, కార్యదర్శి రాయపూడి సత్యనారాయణ, కొమ్మూరి బసవరాజు, 35వ డివిజన్ బీజేపీ ఇన్‌చార్జి డాక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.

కొత్తపేటలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో కూడా గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు పట్నాల హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అండలూరి శ్రీధర్, చిప్పాడ చందు తదితరులు పాల్గొన్నారు.