విద్యుత్ బిల్లులు చెల్లింపుల్లో మరింత సులభతరం…

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త
ఎస్.ఈ. చంద్రశేఖర్ వెల్లడి


తిరుపతి సిటీ, జులై 29 (ఆంధ్రప్రభ): విద్యుత్ బిల్లులు చెల్లింపు మరింత సులభతరమని జిల్లా సూపర్డెంట్ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ వి.చంద్రశేఖర్ బుధవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్.ఈ. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏ.పీ ఎస్పీ డీ.సీ.ఎల్ .విద్యుత్ బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే, పే.టీ.ఎం .వంటి బి.బి పి.ఎస్. యాప్l ల ద్వారా నేరుగా చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. అలాగే ఇప్పుడు భారత్ బిల్ పేమెంట్ సిస్టం లోకి వచ్చిందన్నారు.

దీంతో వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సులభంగా డిజిటల్ కలెక్షన్ ద్వారా ఆన్లైన్ నందు సులభంగా సురక్షితంగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. ప్రయోజనాలు ఆర్బిఐ నియంత్రికమైన సురక్షిత లావాదేవీల తక్షణ చెల్లింపు కన్ఫర్మేషన్ 24/7 ఎప్పుడైనా ఎక్కడైనా చెల్లించవచ్చు అన్నారు ఎటువంటి అదనపు చెల్లింపు ప్రక్రియ సొమ్ము రుసుము లేదన్నారు. ఎస్.ఎం.ఎస్. యాప్ ల ద్వారా తక్షణ కన్ఫర్మేషన్ చెల్లింపు వివరాలు వెంటనే అందుబాటులో ఉంటాయన్నారు.

ఈ డిజిటల్ చెల్లింపు విధానాన్ని వినియోగించుకుని సురక్షితంగా సులభంగా విద్యుత్ బిల్లులను చెల్లించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం www.apspdcl.in కస్టమర్ కేర్ 19 12 టోల్ ఫ్రీ నెంబర్ 1800_425_6192 నెంబర్ను సంప్రదించాలని ఎస్. ఈ. చంద్రశేఖర్ తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.