గ్రామసభల నిధులు కార్యదర్శులకు వెంటనే చెల్లించాలి
మంజూరైన నిధులు నిలిపివేయడం సరికాదు: బీఆర్ఎస్ మాజీ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి
ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ: మంగపేట మండలంలో నిర్వహించిన గ్రామసభల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వెంటనే పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని 25 గ్రామపంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు ఒక్కో గ్రామపంచాయతీకి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
అయితే ఈ నిధులను మండల స్థాయి అధికారి ఒకరు తన వద్దే ఉంచుకుని పంచాయతీ కార్యదర్శులకు విడుదల చేయడం లేదని శ్రీహరి ఆరోపించారు. దీంతో గ్రామసభల నిర్వహణలో కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఒకవైపు వేతనాలు ఆలస్యమవుతుండగా, మరోవైపు సొంత ఖర్చులతో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులను అధికారులు మరింత ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు.
ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి స్పందించి, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వెంటనే సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు అందేలా చర్యలు తీసుకోవాలని గుడివాడ శ్రీహరి కోరారు.
