భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లికి బోనాలు

నాయిబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఊరేగింపు

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి పట్టణంలో నాయిబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.

సంగారెడ్డి ఐబీ నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు అస్తబల్ వరకు సంప్రదాయబద్ధంగా కొనసాగింది. డప్పు చప్పుళ్లు, భక్తిగీతాలు, పోతరాజుల విన్యాసాలు, మహిళలు బోనాలు సమర్పిస్తూ పాల్గొనడంతో పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి ఎమ్మెల్యే తనయుడు చింతా సాయినాథ్, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా నాయిబ్రాహ్మణ సేవా సంఘం నిర్వాహకులు బీఆర్ఎస్ నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కసిని శ్రీకాంత్, రవి, నాయిబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు లకుడారం మాణిక్ ప్రభు, పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షుడు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, కార్యనిర్వాహక అధ్యక్షుడు సాయినాథ్, యూత్ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆంజనేయులు, అధ్యక్షుడు చరణ్, ప్రధాన కార్యదర్శి రాము, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్, మురళి, స్వాగత్ ప్రభు, పెంటయ్య, హనుమంతు, సాయి కిరణ్, అక్షయ్, అఖిల్, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదయ్య, ప్రధాన కార్యదర్శి సుకుమార్, సత్యనారాయణ, మహిళా కమిటీ సభ్యులు సుధామణి, పద్మావతి, పట్టణ కమిటీ సభ్యులు, నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.