పట్నం సోదరులను పరామర్శించిన హరీష్ రావు

మాతృవియోగంపై సంతాపం తెలిపిన బీఆర్ఎస్ నేతలు

షాబాద్, ఆంధ్రప్రభ : షాబాద్ మండల కేంద్రంలో ఇటీవల మాతృవియోగానికి గురైన పట్నం సోదరులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు మంగళవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లిన హరీష్ రావు, ఇటీవల మృతి చెందిన పట్నం రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్, పార్టీ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.