ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్..
వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నెం.10 అనంతగిరిపల్లి లక్ష్మీనగర్‌లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు సోమవారం ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఈ ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నూతన గృహంలో ప్రవేశం కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆశీస్సులతో పేదలందరికీ సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. అనంతగిరిపల్లిని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవి రెడ్యా నాయక్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, పట్టణ వైస్ ప్రెసిడెంట్ రెడ్యా నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు నాయక్, అనంతయ్య, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య, శ్రీనివాస్, బాలరాజు, నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ, జీవితాంతం కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
