ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ ల పంపిణీ
పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పోచం నారాయణ
మోత్కూర్, ఆంద్రప్రభ : విద్యార్థులు పేదరికం కారణంగా చదువుకు దూరం కావద్దని , ప్రతిభ ఉంటే ప్రోత్సహించే వారు ఉంటారని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పోచం నారాయణ అన్నారు.మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన తల్లిదండ్రుల అభినందన సభలో విద్యార్థులకు ఆయన స్వయంగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు కొణతం రాధాబాయి కోదండరావ్ స్మారకార్థం వారి కుమారులు దామోదర్ రాయుడు, చక్రధర్ రావులు అందజేశారు. పదవ తరగతి విద్యార్థులకు పోచం కిష్టమ్మ సత్తయ్యల జ్ఞాపకార్థం వారి కుమారుడు పోచం నారాయణ అందజేశారు.ఈ సందర్భంగా మొత్తం రూ.46 వేల నగదు పురస్కారాన్ని విద్యార్థులకు అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవిందరాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య , వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, కౌన్సిలర్ కూర్మిళ్ల ప్రమీల రాములు,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ధబ్బేటి శైలజ, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు మొగుళ్ళపల్లి సోమయ్య,అవిశెట్టి అవిలిమల్లు ,వారాల యాదగిరి,బుషిగంపల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
