తెలంగాణ స్పోర్ట్స్ మీట్ లో పోలీసుల ప్రతిభ..
సదాశివనగర్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో కామారెడ్డి జిల్లా పోలీసు సిబ్బంది ప్రతిభ కనబరిచి పతకాలు సాధించినట్లు సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ వినయ్ రెడ్డి కరాటే అండర్-60 కేజీల విభాగంలో కాంస్య పతకం,ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ గౌతమ్ ప్రభు 90 కేజీల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు.
ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ గౌతమ్ ప్రభు 90 కేజీల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించి జిల్లా పోలీసు శాఖకు గౌరవాన్ని తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర, ఐపీఎస్ విజేతలను అభినందించి, వారి కృషి, క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తిని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ పోలీసు శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
