ప్రభుత్వం పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  • టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్

కమ్మర్‌పల్లి, జూన్ 24 (ఆంధ్రప్రభ): ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ బుధవారం అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు రావాల్సిన డీఏలను మంజూరు చేయడంతో పాటు, పీఆర్సీ బకాయిలు, ఈహెచ్‌ఎస్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని అన్నారు.

ప్రమోషన్లతో కూడిన బదిలీలు చేపట్టాలని టీపీయూఎస్ రాష్ట్ర శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇవ్వడం జరిగిందని చెప్పారు. లేని యెడల పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పోరాటం తప్పదని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు కిషన్, డివిజన్ బాధ్యులు శంకర్ గౌడ్, వేణు, రవి, ప్రసాద్, స్వర్ణలత పాల్గొన్నారు.