గుంజా హేమలతకు కీలక బాధ్యతలు
ఉయ్యూరు టౌన్, ఆంధ్రప్రభ: యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్‌టీఐ క్యాంపెయిన్ (యు.ఎఫ్.ఆర్.టి.ఐ.) ఉమ్మడి కృష్ణాజిల్లా మహిళా విభాగం కన్వీనర్‌గా గుంజా హేమలత నియమితులయ్యారు. ఆమెకు నియామక పత్రాన్ని రాష్ట్ర మాజీ సమాచార కమిషనర్ ఐలాపురం రాజా యు.ఎఫ్.ఆర్. టి.ఐ. నాయకులు జంపాన శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా గుంజా హేమలత మాట్లాడుతూ… ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం-2005లోని సెక్షన్ 4(1)(బి) నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, పారదర్శక పాలనకు తోడ్పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు.
గుంజా హేమలత ఉయ్యూరు మండలం, ఆనందపురం గ్రామానికి చెందిన, దళిత వర్గానికి చెందిన సామాజిక కార్యకర్త గుంజా హేమలతను మహిళా విభాగం కన్వీనర్‌గా నియమించినందుకు యు.ఎఫ్.ఆర్.టి.ఐ. నాయకులు బేతపూడి జోగేశ్వరరావు, బి. దుర్గాప్రసాద్, ఎం. సాంబశివరావు, బి. శివపార్వతి ఆమెకు అభినందనలు తెలిపారు.
