ఊట్కూర్ సమగ్ర అభివృద్ధే లక్ష్యం..

ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ పట్టణంలోని అన్ని 16 వార్డుల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని భరత్ నగర్,మూడో వార్డులో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె భూమిపూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే గ్రామపంచాయతీ ప్రధాన లక్ష్యమన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అన్ని వార్డుల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు తదితర అభివృద్ధి పనులను చేపడతామని అన్నారు.

గ్రామాభివృద్ధిలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను పారదర్శకంగా వినియోగించి ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వార్డు సభ్యుడు కొక్కు మల్లేష్, నాయకులు కార్యకర్తలు కృష్ణయ్య గౌడ్, హన్మంతు, కొక్కు లక్ష్మణ్
రమేష్, రణవీర్, తిమ్మప్ప, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.