కోడి కత్తితో మహిళ దాడి…
వ్యక్తికి తీవ్రగాయాలు
బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో మహిళపై ఓ వ్యక్తి చేసిన అసభ్య వ్యాఖ్యలు కారణంగా కోడి కత్తితో దాడి చేసింది. తనపై అనుచితంగా మాట్లాడాడనే కోపంతో, గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మణ అనే వ్యక్తిపై సదరు మహిళ కోడి కత్తితో దాడి చేసింది. ఈ ఘాతుకంలో లక్ష్మణ్ రెండు చేతులు, కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి.
మద్యం మత్తులో ఉన్న లక్ష్మణ్ వెంటనే తేరుకుని ఇంటి బయట ఉన్న కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే అతడిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. అకారణంగా తనపై మహిళ కోడి కత్తితో దాడి చేసిందని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
