వార్డు సభ్యుడి నిజాయితీకి స్థానికుల ప్రశంసలు

నేరడిగొండ, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి వచ్చిన వ్యక్తి 15 వేల రూపాయలు విలువగల విలువైన మొబైల్ ఫోన్‌ను అనుకోకుండా పోగొట్టుకున్నాడు. ఆ మొబైల్ ఫోన్‌ను గుర్తించిన మండల కేంద్రానికి చెందిన చిప్పరి రాజేశ్వర్ వార్డు మెంబర్ వెంటనే బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఫోన్ యజమాని వివరాలను తెలుసుకుని అతనికి తిరిగి అందజేశారు. తన విలువైన మొబైల్ ఫోన్ తిరిగి లభించడంతో బాధితుడు వార్డు మెంబర్ చిప్పరి రాజేశ్వర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీతో వ్యవహరించి పోగొట్టుకున్న వస్తువును యజమానికి అప్పగించడం అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడి నిజాయితీకి, సామాజిక బాధ్యతకు ప్రజలు అభినందనలు తెలియజేశారు.