ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు..?

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని దిశా కమిటీ మెంబర్ బీజేపీ నాయకులు వడ్ల నందు డిమాండ్ చేశారు. వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ముందు టపాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సిని వెంటనే అమలు చేయాలని ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తపాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలు కైనా బిజెపి తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవాల్సిందిగా డిఏలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకు పరిమితమైందని చేతల్లో ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తపాస్ నాయకులు అంజిరెడ్డి కూ ర సంగమేశ్వర్ గీతానందిని శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.