Congress | కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న జమున బాయి..

Congress | కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న జమున బాయి..

Congress, వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు వెంకటాపూర్ తండా నుండి డీసీసీబీ మాజీ డైరెక్టర్ కిషన్ నాయక్ సతీమణి మాజీ కౌన్సిలర్ జమున బాయి కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేయనున్నారు. గతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జయ నర్సింగ్ రావు చైర్పర్సన్ గా ఉన్న సమయంలో జమున బాయి కాంగ్రెస్ కౌన్సిలర్గా కొనసాగారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వెంకటాపూర్ తండా జనరల్ మహిళలకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున కిషన్ నాయక్ సతీమణి జమున బాయి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో కిషన్ నాయక్ తో పాటు జమున బాయి వారి కుమారులు రవీందర్ నాయక్, పరశురాం నాయక్ తదితరులు ఓటర్లు కలుస్తూ తమను గెలిపించాల్సిందిగా కోరుతున్నారు.

Leave a Reply