లక్నవరం చెరువులో వృద్ధుడి మృతదేహం కలకలం
- గుర్తుపట్టిన వారు వెంటనే సమాచారం ఇవ్వాలి: పస్రా ఎస్సై తాజుద్దీన్
గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువులో గురువారం గుర్తుతెలియని ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పస్రా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా పస్రా ఎస్సై తాజుద్దీన్ మాట్లాడుతూ, మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే లేదా ఆయనకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించేందుకు పస్రా ఎస్సై 8712670085, పస్రా పోలీస్ స్టేషన్ 8712670086 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
