బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని ఐ.డీ.ఓ.సీలో మంగళవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలోనిర్వహించిన స్నేహ బాలల హక్కుల సదస్సు మరియు మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు,సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు మంచి లక్ష్యాలతో ముందుకు సాగి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ పిడి , డి.డబ్ల్యూ.ఓ మల్లీశ్వరి ,మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply