జన్నారంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శ్రీకారం
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గురువారం మధ్యాహ్నం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసిహుల్లా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీర నందునాయక్, ప్రధాన కార్యదర్శి ఎం. మాణిక్యం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాక్, జిల్లా కార్యదర్శి ముజఫర్, నాయకులు శంకరయ్య, వెంకటి, సాహెల్, రాజేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
