ముద్రగడకు ఘన నివాళులు..
పార్టీలకు అతీతంగా శ్రద్ధాంజలి
నర్సాపురం, ఆంధ్ర ప్రభ : మాజీ మంత్రి, కాపు దివంగత నేత ముద్రగడ పద్మనాభం మృతి కాపు జాతికి తీరని లోటని కాపు సంఘ నేతలు తెలిపారు. నర్సాపురం పట్టణంలో సంతాప సభ ఏర్పాటు చేసి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కాపు సంఘ నాయకులు మాట్లాడుతూ… అనారోగ్యం తో చికిత్సపడుతున్న ఆయన ఆరోగ్య వంతులుగా తిరిగి వస్తారని ఆశించామని, ఆయన భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ ఆయన అందించిన పోరాట పటిమ అందరికీ ఆదర్శంగా నిలిచింది అని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేశారు.
ఆయన ఆశయ సాధన వైపు అడుగులు వేసి కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం కృషి చేస్తామని ప్రకటించారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఈ సంతాప సభలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బా రాయుడు, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి నాయుడు, మాజీ ఎమ్మెల్యే లు కొత్తపల్లి జానకిరామ్, బండారు మాధవ నాయుడు, నాయకులు వై కే ఎస్, పప్పుల రామారావు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, తమ్మిశెట్టి బాబ్జీ, జక్కం బాబ్జీ, కోటిపల్లి సురేష్, కావలి నాని, సంకు భాస్కర్, వలవల నాని , గుగ్గిలపు బుజ్జి, వన్నెంరెడ్డీ శ్రీనివాస్, నిప్పులేటి సత్యనారాయణ, తదితర కాపు సంఘం నేతలు, పట్టణ ప్రముఖులు పాల్గొని ప్రగాఢ సానుభూతి తెలిపారు.
