Bandla Ganesh | ఆస్తి వేలం వివాదంలో పిటిష‌న్

యూబీఐ చర్యలను సవాల్ చేస్తూ పిటిషన్..
హైకోర్టు తీర్పుపై నిర్మాత అభ్యంతరం
ఓటీఎస్‌ కింద రూ.129 కోట్లు చెల్లించినా ఆస్తి వేలం వేశారంటూ ఆరోపణ.. న్యాయం కోరిన బండ్ల గణేశ్

Bandla Ganesh | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆస్తి వేలం వివాదానికి సంబంధించి ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రుణ బకాయిల వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చేపట్టిన చర్యలను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

శ్రీపరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించి జూబ్లీహిల్స్‌లోని తమ ఆస్తిని యూబీఐ వేలం వేసిన వ్యవహారంపై బండ్ల గణేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద రూ.129 కోట్లు చెల్లించినప్పటికీ, బకాయిలు పూర్తిగా పరిష్కారమైన తర్వాత కూడా ఆస్తిని వేలం వేశారని ఆయన ఆరోపించారు.

బ్యాంకు నిర్వహించిన వేలం ద్వారా సుమారు రూ.8.5 కోట్లు వసూలైనట్లు సమాచారం. ఈ వేలం ప్రక్రియను రద్దు చేస్తూ గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. బ్యాంకు చేపట్టిన వేలం ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగానే ఉందని హైకోర్టు పేర్కొంది.