ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్లకు విశేష స్పందన
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో ఆదివారం నిర్వహించిన ప్రవేశాల ప్రక్రియకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 257 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 165 మందికి వివిధ ట్రేడ్లలో సీట్లు కేటాయించారు. మిగిలిన సీట్ల భర్తీ ప్రక్రియను కూడా షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
