గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు
కుంటాల, ఆంధ్రప్రభ : పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కుంటాల మండలంలోని మెదన్పూర్, పెంచికల్పాడు గ్రామాల్లో ఆదివారం గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోచమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని గ్రామదేవతలను ప్రార్థించారు. భజన బృందాల నడుమ గ్రామదేవతల ఆలయాలకు చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
