పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: జూనియర్ సివిల్ జడ్జి మౌనిక

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: జూనియర్ సివిల్ జడ్జి మౌనిక

ఉట్నూర్, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి మౌనిక అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉట్నూర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో న్యాయవాదులతో కలిసి ఆమె మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా జడ్జి మౌనిక మాట్లాడుతూ.. మానవ మనుగడకు ప్రకృతి ప్రధాన ఆధారమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, కాలుష్య నివారణకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బానోత్ జగన్ నాయక్, ప్రధాన కార్యదర్శి బి. జైవంత్‌రావు, జాయింట్ సెక్రటరీ కుడెల్లి అశోక్, కోశాధికారి శ్రీనివాస్, స్పోర్ట్స్ సెక్రటరీ విశాల్, కల్చరల్ సెక్రటరీ వినోద్, న్యాయవాదులు జమీర్‌ఖాన్, ధీరజ్‌గుప్తా, చింతల గిరి, లక్ష్మీనారాయణ, మహేష్, అజహార్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply