ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యార్థినికి రూ.5 వేల నగదు బహుమతి

చిట్యాల, ఆంధ్రప్రభ : చదువులో ప్రతిభ కనబరిస్తే నగదు ప్రోత్సాహం అందజేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ చిట్యాల యువశక్తి యువజన సంఘం సభ్యులు పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేశారు.

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ధరణికోట దినేష్ కుమార్తె ధరణికోట జయశ్రీ (న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్)కి సంఘం అధ్యక్షుడు చింతపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో రూ.5,000 నగదు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చింతపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ, గత ఏడాది యువశక్తి యువజన సంఘం ఇచ్చిన హామీ మేరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు చదువులో మరింత ఉన్నతంగా రాణించేందుకు ప్రోత్సాహం అందించడమే సంఘం లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మద్ది మధు, కోశాధికారి బొడ్డుపల్లి ఉపేందర్, సిలివేరు పరమేశ్, నిమ్మనగోటి శ్రీనివాస్, ఆవుల మహేష్, ఐలపురం నరేష్, గూడ అఖిల్, సిలివేరు రిశ్వంత్, మైల నుకేశ్, బొడ్డుపల్లి ప్రసాద్, శ్రీశాంత్, తిరుపాల గణేష్, రాంచరణ్, ఎస్‌కే ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.