పెద్దమ్మ తల్లి ఆశీర్వదించు..
పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : అమ్మలను కన్న అమ్మకు ప్రతిరూపమైన పెద్దమ్మ తల్లి ప్రజలందరినీ సల్లగా చూడాలని, అందరినీ ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు ప్రార్థించారు. ఆదివారం పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, ముదిరాజ్ సంఘం నాయకులు, సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
