సర్ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేస్తాం: ఆర్డీఓ గంగయ్య
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లిలో సర్ (ఎస్ఐఆర్) ఎన్యూమరేషన్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా, సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య తెలిపారు.
ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని పలు మీ సేవా కేంద్రాలను ఆయన తనిఖీ చేసి, సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని 5వ వార్డులో సర్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ గంగయ్య మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఓటర్ల నుంచి సర్ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఆన్‌లైన్‌తో పాటు మీ సేవా కేంద్రాల్లో కూడా నమోదు సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు, పాత ఓటర్లు పేర్లలో మార్పులు, చేర్పులు, సవరణలు వంటి అవకాశాలను సర్ ప్రక్రియ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిప్యూటీ తహసీల్దార్ విజేందర్, 5వ వార్డు కౌన్సిలర్ గుజ్జుల కుమార్, పిడుగు సంపత్, లింగారావు, బీఎల్ఓలు, ప్రజలు పాల్గొన్నారు.
