బాసర సరస్వతి అమ్మవారితో గానకోకిల జానకమ్మకు ప్రత్యేక అనుబంధం

బాసర (నిర్మల్ జిల్లా), (ఆంధ్రప్రభ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయంతో ప్రముఖ గానకోకిల ఎస్. జానకికి ప్రత్యేక అనుబంధం ఉంది. నెల రోజుల క్రితం ఆమె బాసర ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చెందిన నాదస్వర విద్వాంసురాలు వెదురూరు కుమారి నాదస్వరంపై ఆలపించిన “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు” పాట జానకిని విశేషంగా ఆకట్టుకుంది.

అనంతరం జానకి ఆలయ అర్చక బృందం, ఆలయ సిబ్బంది, భక్తులతో కలిసి ఫొటోలు దిగడంతో పాటు అందరితో ఆప్యాయంగా ముచ్చటించారు. బాసర అమ్మవారిపై తనకున్న భక్తి, అనుబంధాన్ని ఈ సందర్భంగా మరోసారి చాటుకున్నారు.