సమిష్టి కృషితోనే ఫలితాల సాధన

సమిష్టి కృషితోనే ఫలితాల సాధన

డీడీ అంబాజీ జాదవ్

ఉట్నూర్, ఆంధ్రప్రభ: పదవ తరగతి ఫలితాలు బుధవారం వెల్లడి కాగా ఈ ఫలితాల్లో ఉట్నూర్ ఐటీడీఏలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల పదోతరగతి విద్యార్థులు 98.83 శాతం ఫలితాలు సాధించారని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టరు జాదవ్ అంబాజి తెలిపారు. బుధవారం పదవ తరగతి ఫలితాల వెల్లడి అనంతరం వివరాలను వెల్లడించారు.

మొత్తం 48 ఆశ్రమ పాఠశాలల్లో 1600 మంది విద్యార్థులకు గాను 1582 మంది ఉత్తీర్ణులు అయ్యారని చెప్పారు. రెండు గిరిజన వసతి గృహాల్లో 74 మంది విద్యార్థు లకు గాను 72 మంది పాసయ్యారు , 6 బెస్ట్ ఆవై లబుల్ పాఠశాల లలో 126 మంది విద్యార్థులకు గాను 125 మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. జిల్లాలోని 46 ఆశ్రమ పాఠశాలలకు గాను 36 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించారుని వెల్లడించారు.

ఆశ్రమ బాలికల పాఠశాల నేరడి గొండకు చెందిన పి. షాలిని 568 మార్కులు, మడగూడ ఆశ్రమ పాఠశాలకు చెందిన నిస్తే దివ్య 567 మార్కులు, ఇంద్రవెల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన కుoర భీంబాయి 563 మార్కులు సాధించారని తెలిపారు . కాగా ప్రాజెక్ట్ అధికారుల మార్గదర్శనం, పర్యవేక్షణలో ఉప విద్యా ధికారి , ఏపీఓ, పివిటి జి, ప్రధానోపాధ్యాయులు, ఏటిడిఒలు , పియంఆర్సి అధికారులు, ఉపాధ్యాయులు, వసతి గృహ శంక్షేమ అధికారుల సమిష్టి కృషితో ఫలితాలు సాధ్యమయ్యయని పేర్కొన్నారు. 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యా యులను, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పివిటిసి ఏపీవో ఆత్రం భాస్కర్ ఐటీడీఏ విద్యాశాఖ ఉద్యోగులు ఐటీడీఏ డిడి అంబాజీ జాదవ్, ఏజెన్సీ డీఈవో గోడం చందన్ కు శాలువాలతో సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply