ఘనంగా రాజామాత ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు
మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలో శనివారం రాజమాత ఫౌండేషన్ 14వ వార్షికోత్సవ వేడుకలు, ఎడ్యుకేషన్ సెంటర్ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాజమాత ఎడ్యుకేషన్ సెంటర్ విద్యార్థులు డాన్స్, పాటలు, స్కిట్ చేయడం జరిగింది . పాటిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంచనపల్లి నుండి వచ్చే విద్యార్థులకు 3 సైకిల్ లు దాతల సహకారంతో అందజేశారు.ఈ కార్యక్రమంలో రాజమాత ఫౌండేషన్ నిర్వాహకులు మనోజ్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు, గ్రామ సర్పంచ్ బండ రమ విజయ్ రెడ్డి, పాఠశాల హెచ్ ఎం,ఉపాధ్యాయులు,కుటుంబ సభ్యులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
