పార్టీలు వేరైనా మానవత్వం ఒక్కటే..
- మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : పార్టీలు వేరైనా మానవత్వం ఒక్కటేనని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు చాటిచెప్పారు. ఇటీవల మాజీ ఎంపీటీసీ కందుకూరి రమేష్ తండ్రి కందుకూరి రాములు మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు శనివారం నాగాపూర్‌లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షుడు డాక్టర్ దాసన్ల ప్రభాకర్, డీసీసీ కార్యదర్శి జగదీష్ జాదవ్, ఉప సర్పంచ్ హరినాయక్ మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, రాములు మృతి చెందిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కందుకూరి రమేష్‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కైసర్, అరకిల్ల అశోక్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
