పార్టీ బలోపేతమే లక్ష్యం..

మండల నేతలకు విష్ణువర్ధన్ రెడ్డి దిశానిర్దేశం

ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచన

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలపై దృష్టి సారించాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి మండల నాయకులకు సూచించారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండల పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రమేశ్ బాబు మండలంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, రానున్న రోజుల్లో అమలు చేయాల్సిన కార్యాచరణపై సమగ్రంగా వివరించారు.

సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత అభివృద్ధి, గ్రామస్థాయిలో పార్టీ విస్తరణ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేలా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పదాధికారులతో విస్తృతంగా చర్చించారు.

ఇటీవల నిర్వహించిన పార్టీ శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించినందుకు మండల అధ్యక్షుడు రమేశ్ బాబుతో పాటు కార్యక్రమం విజయానికి కృషి చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తను విష్ణువర్ధన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.