Teacher | తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీల‌న‌…

Teacher | తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీల‌న‌…

Teacher | అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ : శింగనమల మండలం తరిమెల గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న తల్లి–కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ మంగళవారం పరిశీలించారు. తరిమెల గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ, ఆమె కుమారుడు చిన్నాను ఆస్తి తగాదాల నేపథ్యంలో నిన్న రాత్రి హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఘటన స్థలాన్ని శింగనమల సీఐ కౌలుట్లయ్య, ఎస్సై సాగర్ తో కలసి స్వయంగా పరిశీలించారు.

హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఫోరెన్సిక్ ఆధారాలు, రక్తపు మరకలు, ఇతర సాంకేతిక ఆధారాలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి ఘటనకు దారి తీసిన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొంతకాలంగా ఆస్తి వివాదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితులను గుర్తించి, అత్యంత త్వరితగతిన అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Leave a Reply