ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీ

కోడూరు – ఆంధ్రప్రభ : ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాణి సంయుక్త, సి హెచ్ఓ ఎం.లీల, పిహెచ్ఎన్ పుష్పలత, స్టాఫ్ నర్స్ నాంచారమ్మ, ఫార్మసిస్టు వాణి, హెల్త్ అసిస్టెంట్ వీరాస్వామి, తారకమస్తాను రావు, ఆశా వర్కర్ లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవ స్లోగన్ “పిల్లల మధ్య ఎడం పాటిద్దాం ఆరోగ్యకరమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామని నినాదాలు చేశారు.