చెన్నూరు శానిటేషన్ సూపర్వైజర్ మృతికి సంతాపం
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు శానిటేషన్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ ముజ్జు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందడం పట్ల నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మండల మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సున్నపు ఓంకార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సయ్యద్ ముజ్జు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.అలాగే, మృతుడి కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సయ్యద్ ముజ్జు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని ఓంకార్ ఆకాంక్షించారు.
