Nara Brahmani | బ్రాహ్మణికి అరుదైన గౌరవం..
అభినందించిన సీఎం చంద్రబాబు
ఫార్చ్యూన్ ఇండియా శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు
‘ఫార్చ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్–2026’ జాబితాలో చోటు దక్కడం గర్వకారణమన్న సీఎం
యువతులకు, ముఖ్యంగా తెలుగు కుమార్తెలకు బ్రాహ్మణి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసలు
Nara Brahmani | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఫార్చ్యూన్ ఇండియా ‘100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్–2026’ జాబితాలో నారా బ్రాహ్మణికి స్థానం దక్కిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు బ్రాహ్మణి నాయకత్వ లక్షణాలు, అంకితభావం, శ్రేష్ఠత సాధన పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె సాధించిన ఈ ఘనత కుటుంబానికే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా గర్వకారణమని అన్నారు.
బ్రాహ్మణి తన కృషి, నాయకత్వంతో ఎంతోమంది యువతులకు, ముఖ్యంగా తెలుగు కుమార్తెలకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని సీఎం కొనియాడారు. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బ్రాహ్మణి సాధించిన ఈ గుర్తింపు మహిళా నాయకత్వానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చే సందర్భంగా నిలుస్తుందని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.
