అల్ల నేరేడు పండ్లు అత్యధికంగా కాయడం దేనికి సంకేతం..
కరువుకు సూచన అంటున్న నిపుణులు
వికారాబాద్, ఆంధ్రప్రభ : గతంలో ఈనాడు కాయని విధంగా అల్లనేరేడు చెట్లకు అల్లనేరేడు పండ్లు విరగభూసాయి. సాధారణంగా మామూలుగా కాసి చెట్లకు సైతం పెద్ద ఎత్తున అల్లనేరేడు పండ్లు కాయడంతో ఇది ఎందుకు సంకేతం అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇలా అల్లనేరేడు పండ్లు కాసినప్పుడు తప్పనిసరిగా కరువు పరిస్థితి నెలకొంటాయని గతంలో కొన్ని సందర్భాల్లో అనుభవం ఉన్న నిపుణులు పేర్కొంటున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా తగ్గినప్పుడు ఈ అల్లనేరేడు పనులు చెట్లకు కాశి పరోక్షంగా ప్రజలకు సంకేతాన్ని ఇస్తుందని రాబోయే రోజుల్లో వర్షాలు తక్కువగా కురుస్తాయని ఈ పండ్లు ముందస్తు హెచ్చరిక చేస్తుందని అభిప్రాయం. ఏది ఏమైన పటికి గత నెల రోజులుగా పరిశీలిస్తే వర్షాలు తక్కువగా కురిశినాయన్నది వాస్తవం. ఏ అల్లనేరేడు చెట్టుకు చూసినా పెద్ద ఎత్తున పండ్లు కనిపిస్తున్నాయి . అల్లనేరేడు చెట్టు కింద పండ్లు పడి చాలా మంది వాటిని తీసుకెళ్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అల్లనేరేడు పనులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ రాబోయే కరువు పరిస్థితులు వస్తాయన్నది ఈ పండ్లు హెచ్చరిస్తుండడం ప్రజల్ని ఆందోళన గురిచేస్తుంది.
