suspicious | భర్త ఉరివేసుకుని.. భార్య మృతదేహం నేల‌పై ప‌డి..

suspicious | భర్త ఉరివేసుకుని.. భార్య మృతదేహం నేల‌పై ప‌డి..

suspicious | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్‌లోని రామా టాకీస్ థియేటర్ వెనుక ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో దంపతులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది.

అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో నివసిస్తున్న బాలరాం (33), ప్రియాంక (27) అనే దంపతులు మృతిచెందినట్లు గుర్తించారు. భర్త బాలరాం ఉరివేసుకుని ఉండగా, భార్య ప్రియాంక మృతదేహం గదిలో కిందపడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతుల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇది ఆత్మహత్యా, ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply