బాసర ఆలయ శిథిలాల తొలగింపు పనులను పరిశీలన

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న పురాతన ఆలయ శిథిలాల తొలగింపు పనులను భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ఉత్తర ద్వార గోపురం, అక్షరాభ్యాస మండపం ప్రహరీ గోడ శిథిలాల తొలగింపు పనుల పురోగతిని ఆయన పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీనివాస్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.