హైదరాబాద్ కు బయలుదేరిన బీజేపీ నాయకులు
భీమారం, ఆంధ్రప్రభ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు శంకుస్థాపనలు, బహిరంగ సభకు ఆదివారం హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో గోపాల్ పూర్ జోనల్ ప్రధాన కార్యదర్శి పప్పుల రమేష్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ కు బయలుదేరిన వారిలో జిల్లా నాయకులు చింతలపాని అమరేందర్ రెడ్డి, నాతి రమేష్,కోటగిరి నరేందర్, రామచందర్, పేరాల కుమార్ తదితరులున్నారు.
