కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలి..
- జయపురం గ్రామ విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు వీరారెడ్డి
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని జయపురం గ్రామ విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు వీరారెడ్డి అన్నారు.
శుక్రవారం మండలంలోని జయపురం గ్రామానికి చెందిన కీర్తిశేషులు చందు కొమరయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, ఎక్సైజ్ ఎస్‌ఐ చందు వెంకన్న స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పాఠశాల కార్యక్రమాలకు ఉపయోగపడేలా రూ.10 వేల విలువైన సౌండ్ సిస్టమ్, మైక్ సెట్‌ను విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు.
అనంతరం చందు వెంకన్న కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చుక్క వేణు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓరుగంటి వెంకటయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మందుల ఉపేంద్ర, ఎం.డి. జాఫర్, ఉపాధ్యాయులు సతీష్, సంధ్య, వెంకన్న, రామస్వామి, నాగరాజు, చిట్టి తదితరులు పాల్గొన్నారు.
