అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

సంగెం, ఆంధ్రప్రభ: మండలంలోని గుంటూరుపల్లి గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా అంగన్వాడి భవనాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బాలల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల విద్యాభివృద్ధికి, గర్భిణీలు మరియు బాలింతల ఆరోగ్య పరిరక్షణకు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే డైట్ చార్జెస్ పెంపు, ఆధునిక విద్యా ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు సమన్వయంతో అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
