ఆలేరు పిఎసిఎస్ పాలకమండలి ప్రమాణ స్వీకారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : ఆలేరు పిఎసిఎస్ కు నూతన పాలక మండలిని ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో నూతన చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ గా జనగాం ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్లుగా మోర్తల మోహన్ రెడ్డి, బండ వీరమల్లయ్య, మాలోతు శ్రీను, బీసు నరహరి, చెక్క వెంకటేష్, చాడ రాజు, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, సుక్క యాదమ్మ, ఆలకుంట్ల స్వరూప, వట్టిపల్లి శ్రీనివాస్, జన్నే భిక్షపతి, సందేపల్లి ముత్తయ్య ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. అనంతరం చైర్మన్, డైరెక్టర్లను ప్రభుత్వ విప్ ఐలయ్య సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, సీఈఓ వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ సిబ్బంది, ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, రైతులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.