పీఆర్టీయూ సభ్యత్వమే ఉపాధ్యాయులకు ఒక వరం: మండల నాయకులు
మరిపెడ, ఆంధ్రప్రభ : పిఆర్టీయూలో సభ్యత్వమే ఒక వరం అని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అలుపెరుగని కృషి చేస్తున్న సంఘం పిఆర్టీయూ అని పిఆర్టీయూ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్ అన్నారు.పిఆర్టీయూ సభ్యత్వ నమోదులో భాగంగా మరిపెడ, గుండెపుడి తానంచర్ల,బరహాన్ పురం తాళ్ళఊకల్,గిరిపురం,బావోజిగూడెం,రాంపురం,చిల్లంచర్ల పాఠశాలలో సభ్యత్వ నమోదులో భాగంగా వారు మాట్లాడుతూ పిఆర్టీయూ సంఘం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది అన్నారు.ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించే వరకు పిఆర్టీయూ సంఘం అలుపెరుగని పోరాటం చేస్తుంది అన్నారు.
సంఘం ఉపాధ్యాయులు కొరకు పనిచేస్తున్న విధానానికి ఆకర్షితులై యస్సీ,యస్టీ ఉపాధ్యాయ సంఘ మరిపెడ మండల బాధ్యులు గుగులోత్ మంగూ,పురం వీరన్న పిఆర్టీయూ సభ్యత్వం స్వీకరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్ రాష్ట్ర బాధ్యులు బాయగాని రాంమోహన్,దత్తప్రసాద్,యాకయ్య,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గండి కరుణాకర్,సరోజ,గుర్రం వెంకన్న,సంఘ బాధ్యులు క్రిష్ణా రెడ్డి,మురళీ,నివేదిత,లింగయ్య,సంపత్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
