ఎస్ ఐ ఆర్ ప్రక్రియను వేగవంతంగా చేయాలి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఎస్ ఐ ఆర్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టి, గడువులోగా పూర్తిగా చేయాలని ఉరవకొండ తహసిల్దార్ అరుణ సూచించారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా ఉరవకొండ మండలంలో
68, 851 మంది ఓటర్లు ఉండగా అందులో ఎస్ ఐ ఆర్ కింద 66,851 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశామన్నారు.
51,553 ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి తీసుకుని ( 74.42 శాతం ) అప్లోడ్ చేయడం
జరిగిందన్నారు. ఉరవకొండ పట్టణంలో 30,939 మంది ఓటర్లు ఉండగా ఎస్ ఐ ఆర్ కింద 29, 669 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా ఈనెల 11, 12 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బిఎల్ఏలు, రాజకీయ పార్టీలు సహకారాన్ని అందించాలన్నారు.