రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గం ప్రజలందరికీ ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదర, సోదరీమణులు పరమ పవిత్రంగా రంజాన్ మాసమంతా కఠిన ఉపవాస దీక్షలు చేసి ఐదు పూటల నమాజు చేసుకొని అల్లాను ఆరాధిస్తూ తమకు , తమతో పాటు అందరికీ శుభాలను చేకూర్చాలని ప్రార్థనలు చేస్తారని, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నిర్వహించుకునే అతిపెద్ద పండుగ రంజాన్ అని తెలియజేస్తూ వారికి పండుగ సందర్భంగా ఈద్ ముబారక్ తెలియజేశారు.
ఈ రంజాన్ పర్వదినాన బంధువులు, మిత్రులు, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండి ఆనందంగా ఉండాలని వారికి ఆర్థికంగా కలిసి రావాలని ఆకాంక్షించారు. అల్లా యొక్క ఆశీస్సులు యావత్తు మానవాళికి ఎల్లవేళలా తోడుండాలని ఆయన కోరుతూ ప్రతి ఒక్కరికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
